Rajasthan: యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త, అత్తమామలు

married Tribal woman paraded naked by inlaws over extramarital affair in Rajasthan
  • రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో గురువారం వెలుగు చూసిన దారుణం
  • మరో వ్యక్తితో ఉంటున్న వివాహితపై భర్త, అత్తమామల దారుణం
  • నెట్టింట వీడియో వైరల్, రాష్ట్రంలో రేగిన కలకలం
  • ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసుల ప్రకటన
  • రాష్ట్ర ముఖ్యమంత్రిపై బీజేపీ మండిపాటు
  • సీఏంను రాజీనామా చేయమనరా? అంటూ రాహుల్‌ గాంధీకి బీజేపీ ఎంపీ సూటి ప్రశ్న    
రాజస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ప్రతాప్‌ఘడ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో కూడా వైరల్‌గా మారింది. సాయం చేయాలని బాధితురాలు వీధుల్లోని వారిని వేడుకుంటుండగా ఆమెపై భర్త కర్కశంగా ప్రవర్తించాడు. 

మరో వ్యక్తితో ఉంటున్న ఆమెను భర్త, అత్తమామలు కిడ్నాప్ చేసి తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఇష్టారీతిన చేయిచేసుకుని ఆపై నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. 

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని రాజస్థాన్ డీజీపీ తెలిపారు. మరికొన్ని గంటల్లో మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. 

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ అమానవీయ ఘటనను ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. పౌర సమాజంలో ఇటువంటి నేరగాళ్లకు స్థానం లేదని వ్యాఖ్యానించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిపిస్తామని, నిందితులను వీలైనంత త్వరగా కటకటాల్లోకి తోస్తామని ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 

బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ దారుణాన్ని ఖండించారు. ఇది హద్దులులేని అమానవీయ ఘటన అని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన రెండు రోజులైనా పోలీసులు రిపోర్టు సిద్ధం చేయలేదేంటని రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ‘‘మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కారా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఈ ఘటన బయటపెట్టిందని కూడా వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు రాహుల్ గాంధీ.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిని రాజీనామా చేయమంటారా? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరతారా?’’ అని ప్రశ్నించారు.
Rajasthan
Crime News
Ashok Gehlot
BJP
Rahul Gandhi

More Telugu News