GST: ఆగస్టు మాసంలోనూ రూ.1.6 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

  • ఆగస్టు నెల జీఎస్టీ వివరాలు వెల్లడించిన కేంద్రం
  • రూ.1.6 లక్షల కోట్ల మార్కు అందుకోవడం ఇది వరుసగా మూడోసారి
  • గతేడాది ఆగస్టుతో పోల్చితే 11 శాతం పెరుగుదల 
August month GST details

ఆగస్టు మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం నేడు వెల్లడించింది. జీఎస్టీ వసూళ్లు మరోసారి ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల మార్కు దాటినట్టు తెలిపింది. ఆగస్టు నెలలో రూ.1.6 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు వివరించింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే జీఎస్టీ ఆదాయం 11 శాతం పెరిగింది. 2022 ఆగస్టులో రూ.1.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. 

కాగా, దేశీయ లావాదేవీలకు సంబంధించి జీఎస్టీ 14 శాతం పెరిగిందని కేంద్రం రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. జీఎస్టీ ఆదాయం రూ.1.6 లక్షల కోట్లు దాటడం వరుసగా ఇది మూడోసారి. గత ఏప్రిల్ లో జీఎస్టీ రూ.1.87 లక్షల కోట్లు వసూలు కాగా, జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధికం.

More Telugu News