Nadendla Manohar: వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

  • వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందన్న నాదెండ్ల
  • ఒకేసారి ఎన్నికలు జరిగితే ధనం ఆదా, ప్రజలకు మేలు అని వెల్లడి
  • పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న నాదెండ్ల
Janasena will support one nation and one election

వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ నినాదానికి సంబంధించి కేంద్రం సమాలోచనలు జరుపుతోందన్నారు. ఈ అంశంపై కేంద్రం పెద్దలు తమతో చర్చలు జరిపారన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే ధనం ఆదా అవుతుందని, అలాగే ప్రజలకూ మేలు జరుగుతుందన్నారు. అందుకే వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందన్నారు.

అయితే ఈ విషయంపై పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జమిలి ఎన్నికలపై చాలా రోజులుగా చర్చ సాగుతోందన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై స్పందిస్తూ... త్వరలో తేదీలను ఖరారు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయన్నారు.

More Telugu News