Ambati Rambabu: చంద్రబాబుకు ఐటీ నోటీసుల వార్తలపై అంబటి రాంబాబు చురకలు

Ambati Rambabu tweet on IT notices to Chandrababu
  • చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయంటూ మీడియాలో వార్తలు
  • సోషల్ మీడియా వేదికగా మంత్రి అంబటి స్పందన
  • రా.. కదలి రా! ఐటీ పిలుస్తోంది అంటూ ట్వీట్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు రావడంపై వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా 'ఐటీ పిలుస్తోంది రా' అంటూ చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఎద్దేవా చేశారు. 'రా ...కదలి రా ! ఐటీ పిలుస్తుంది  !! @ncbn' అంటూ ట్వీట్ చేశారు. 

చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు పంపిందంటూ ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీల నుంచి చంద్ర‌బాబుకు దాదాపు 118 కోట్ల మొత్తం ముడుపుల రూపంలో అందినట్లుగా ఐటీ శాఖ ఆరోపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చ‌ట్టం ప్ర‌కారం ఆ సొమ్ము అప్ర‌క‌టిత ఆదాయంగా పేర్కొంది. బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటీ శాఖ ప్రాథమిక ఆధారాలు సేకరించిందని మీడియా సమాచారం.
Ambati Rambabu
Chandrababu
Income Tax
Andhra Pradesh

More Telugu News