Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రష్ చూశాను.. మైండ్ బ్లోయింగ్: ఉమైర్ సంధు

  • ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దేవర'
  • ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందన్న ఉమైర్ సంధు
  • 2024 ఏప్రిల్ 5న విడుదలవుతున్న భారీ బడ్జెట్ మూవీ
Junior NTR Devara rush is mind blowing says Umair Sandhu

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వైరల్ అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. తారక్ పవర్ కు తగ్గట్టుగా ఆయన పాత్ర ఉంటుందని ఫస్ట్ లుక్ చూడగానే అర్థమవుతోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. 

మరోవైపు, ఎన్టీఆర్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్తను ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన 10 సెకన్ల రష్ చూశానని... మైండ్ బ్లోయింగ్ గా ఉందని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని చెప్పాడు. ఈ ఎపిక్ సాగా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇంకోవైపు, ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్లతో నిర్మిస్తున్నట్టు సమాచారం.

More Telugu News