R 5 Zone: అమరావతి ఆర్5 జోన్ పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

  • ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలు ఆపేయాలన్న హైకోర్టు
  • హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
  • హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
Backlash for AP Govt in Supreme Court on R 5 zone

అమరావతిలోని ఆర్5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆర్5 జోన్ పై ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ప్రతివాదులకు మూడు వారాల గడువిస్తూ తదుపరి విచారణను నవంబర్ నెలకు వాయిదా వేసింది. ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలను ఆపేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ఆర్5 జోన్ లో ఈ ప్రాజెక్టును చేపట్టామని ధర్మాసనానికి ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు. అయినప్పటికీ హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.

More Telugu News