Luna-25: చంద్రుడిపై రష్యా ల్యాండర్ కూలిపోయిన చోట పెద్ద గొయ్యి... ఫొటోలు విడుదల చేసిన నాసా

  • ఆగస్టు 11న లూనా-25ని ప్రయోగించిన రష్యా
  • చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలే లక్ష్యం
  • చంద్రుడిపై ల్యాండింగ్ పాయింట్  కు కొన్ని కి.మీ ఎత్తులో విఫలం
  • లూనా-25 కూలిపోయిన చోటును గుర్తించిన నాసా స్పేస్ క్రాఫ్ట్
NASA releases images of where Russian Luna25 mission on Moon

చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపేందుకు ఇటీవల రష్యా విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. జాబిల్లికి మరోవైపున పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 కుప్పకూలిపోయింది. ల్యాండింగ్ పాయింట్ కు కొన్ని కిలోమీటర్ల ఎత్తునే లూనా-25 విఫలమైంది. 

ఇది కూలిపోయిన చోటును తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. దీనికి సంబంధించి లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ తీసిన ఫొటోలను నాసా విడుదల చేసింది. 

చంద్రుడి ఉపరితలంపై 10 మీటర్ల వెడల్పుతో ఉన్న భారీ గొయ్యి ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ఇది కొత్తగా ఏర్పడినట్టు నాసా చెబుతోంది. రష్యా లూనా-25 కూలిపోవడం వల్ల ఆ భారీ గొయ్యి ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయపడింది.

More Telugu News