Bullet 350: రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బుల్లెట్ మార్కెట్లోకి వచ్చేసింది!

  • బుల్లెట్ 350ని విడుదల చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్
  • డిజైన్ పరంగా పెద్దగా మార్పుల్లేని వైనం
  • కొద్దిగా అదనపు ఫీచర్లతో నయా బుల్లెట్
  • గరిష్ఠంగా రూ.2.16 లక్షలు పలకనున్న బుల్లెట్ 350
Royal Enfield new Bullet 350 released

రాజసానికి మారుపేరులా నిలిచే మోటార్ సైకిల్ అంటే బుల్లెట్ గురించే చెప్పాలి. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ తయారుచేసే ఈ బైక్ కు భారత్ లో ఇప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ పాప్యులారిటీని దృష్టిలో ఉంచుకుని రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్తగా 2023 బుల్లెట్ 350 మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. 

డిజైన్ పరంగా చూస్తే ఇది పాత మోడల్ బుల్లెట్ లాగే ఉంటుంది. కానీ అదనపు ఫీచర్లు ఉంటాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ జే-ప్లాట్ ఫామ్ పై రూపొందించిన ఈ 349 సీసీ బైక్ లో ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్ బాక్స్, సర్క్యులర్ హాలోజెన్ హెడ్ ల్యాంప్, టెలిస్కోపిక్ ఫోర్క్స్ (ఫ్రంట్)... ట్విన్ గ్యాస్ చార్జ్ డ్ షాక్ అబ్జార్బర్స్ (రియర్)... అమర్చారు. 27 ఎస్ఎం టార్క్ వద్ద 20 బీహెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 

స్టాండర్డ్ బ్లాక్, బ్లాక్ గోల్డ్, మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్, స్టాండర్డ్ మెరూన్ రంగుల్లో లభ్యమవుతుంది. మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్ బుల్లెట్ ధర రూ.1.73 లక్షల నుంచి ప్రారంభం కానుండగా... స్టాండర్డ్ బ్లాక్, స్టాండర్డ్ మెరూన్ బుల్లెట్ ధర రూ.1.97 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 

బ్లాక్ గోల్డ్ వేరియంట్  కు టాప్ ప్రైస్ నిర్ణయించారు. దీని ధర రూ.2.16 లక్షలుగా పేర్కొన్నారు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. బుల్లెట్ 350 మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేసిన నేపథ్యంలో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

More Telugu News