Rajinikanth: జైలర్ లాభాల నుంచి రజనీకాంత్‌కు మరో రూ.100 కోట్లు ఇచ్చిన నిర్మాత?

Jailer makers handover another Rs 100 crore cheque to Rajinikanth
  • జైలర్ సినిమాకు అదిరిపోయే వసూళ్లు
  • రూ.110 కోట్ల రెమ్యునరేషన్ కాకుండా మరో రూ.100 కోట్లకు చెక్కు 
  • కారును బహుమతిగా ఇచ్చిన కళానిధి మారన్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం వసూళ్ల రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించి మంచి వసూళ్లు వస్తుండటంతో నిర్మాత కళానిధి మారన్... సూపర్ స్టార్‌కు ప్రత్యేక బహుమతిని అందించారు. గురువారం సాయంత్రం రజనీని కలిసిన మారన్ ఈ సినిమాకు వచ్చిన లాభాల నుండి కొంతమొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు. అలాగే రెండు బీఎండబ్య్లు కార్లను తీసుకెళ్లి, నచ్చింది తీసుకోవాలని కోరారు. రజనీకాంత్ బీఎండబ్ల్యు ఎక్స్7 కారును ఎంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

కాగా, రజనీకి ఇచ్చిన చెక్కు రూ.100 కోట్లదిగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రజనీకి రూ.110 కోట్ల రెమ్యునరేషన్ అందినట్టు సమాచారం. తాజాగా సినిమాల్లోని లాభాల ద్వారా ఇచ్చిన రూ.100 కోట్లతో కలుపుకుంటే రూ.210 కోట్లు అవుతుందని అంటున్నారు. అలాగే బహూకరించిన కారు ధర రూ.1 కోటికి పైగా ఉంటుందని తెలుస్తోంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన జైలర్ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ రూ.240 కోట్లుగా తెలుస్తోంది. ప్రి-రిలిజ్ బిజినెస్ ద్వారా రూ.250 కోట్లు వచ్చాయని అంచనాలు ఉన్నాయి. నిర్మాతలు ఈ సినిమా ద్వారా ఇప్పటి వరకు రూ.250 కోట్ల లాభాలను నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News