MLA Chittibabu: వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. హైదరాబాద్ లో చికిత్స!

YSRCP MLA Chittibabu suffers brain stroke

  • బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన చిట్టిబాబు
  • తొలుత రాజమండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
  • మెదడులో రక్తం గడ్డకట్టినట్టు తేలడంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలింపు

కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురయినట్టు, మెదడులో రక్తం గడ్డకట్టినట్టు స్కానింగ్ లో తేలింది. ఆ వెంటనే ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన కుమారుడు వికాస్ మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

MLA Chittibabu
YSRCP
Brain Stroke
  • Loading...

More Telugu News