Adilabad: భార్యను హత్యచేసి పోలీసులకు లొంగిపోయేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

Husband killed in road accident after he kills his wife

  • ఆదిలాబాద్‌లో ఘటన
  • వివాహమైన నాలుగు నెలలకే భార్యపై అనుమానం
  • ఈ తెల్లవారుజామున హత్యచేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు
  • ఆగివున్న లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి

వివాహమై నాలుగు నెలలు కూడా కాకుండానే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేసి ఆపై పోలీసులకు లొంగిపోయేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదిలాబాద్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణ సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. 

అయితే, అంతలోనే ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అరుణ్ ఈ తెల్లవారుజామున ఆమెను హత్య చేశాడు. ఆపై పోలీసులకు లొంగిపోయే ఉద్దేశంతో బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న అరుణ్ అదుపు తప్పి ఖుర్షిద్‌నగర్ వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News