Chandramukhi-2: "మోరునియే మోరునియే... నాచే మోరునియే"... చంద్రముఖి-2 నుంచి పక్కా మాస్ సాంగ్ విడుదల

  • రాఘవ లారెన్స్, కంగన రనౌత్ జంటగా చంద్రముఖి-2
  • సీనియర్ దర్శకుడు పి.వాసు డైరెక్షన్ లో చిత్రం
  • సెప్టెంబరు 15న విడుదల
Moruniye song released from Chandramukhi 2

స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ భామ కంగన రనౌత్ జంటగా సీనియర్ దర్శకుడు పి.వాసు డైరెక్షన్ లో వస్తున్న చిత్రం చంద్రముఖి-2. గతంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖికి ఇది సీక్వెల్. 

కాగా, చంద్రముఖి-2 చిత్రం నుంచి ఓ పక్కా మాస్ సాంగ్ ను చిత్రబృందం నేడు రిలీజ్ చేసింది. "మోరునియే మోరునియే... నాచే మోరునియే" అంటూ సాగే ఈ హుషారైన గీతానికి కీరవాణి బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఎస్పీ చరణ్, శ్రీనిధి తిరుమల ఆలపించారు. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ లిరికల్ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన చంద్రముఖి-2 సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

More Telugu News