Samantha: సమంతను మోసం చేసిన పర్సనల్ మేనేజర్?

Samantha personal manager cheated her
  • సమంతను పర్సనల్ మేనేజర్ ఆర్థికంగా మోసం చేయాలని చూశాడంటూ ఆంగ్ల పత్రికల్లో కథనాలు
  • కోటి రూపాయలు కొట్టేయడానికి పథకం పన్నినట్టు వార్తలు
  • విషయం తెలుసుకున్న సామ్ ఆవేదనకు గురయిందని కథనాలు
విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన 'ఖుషి' సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఓ రేంజ్ లో జరిగింది. సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంది. మరోవైపు సామ్ గురించి ఆంగ్ల పత్రికల్లో ఒక ఆసక్తికర వార్త వచ్చింది. ఆమె పర్సనల్ మేనేజర్ ఆమెను ఆర్థికంగా మోసం చేయాలని చూశారనేదే ఆ వార్త. ఆమెకు తెలియకుండా దాదాపు కోటి రూపాయలు కొట్టేయడానికి పథకం పన్నినట్టు రాశాయి. 

ఈ విషయం తెలుసుకున్న సమంత తీవ్ర ఆవేదనకు గురయిందని, కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయాలని చూడటం ఆమె తట్టుకోలేకపోయిందని అంటున్నారు. అతని స్థానంలో మరొక మేనేజర్ ను పెట్టుకునే యోచనలో సమంత ఉందని తెలుస్తోంది.
Samantha
Tollywood
Bollywood

More Telugu News