Parliament: సెప్టెంబరు 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

  • వచ్చే నెలలో 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
  • అమృతకాల ఘడియల్లో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్రం వెల్లడి
  • ఇటీవలే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
Parliament special session starts from September 18

వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అమృత కాల ఘడియల నేపథ్యంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, ప్రసంగాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

కాగా, జులై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11తో ముగిశాయి. మణిపూర్ హింసపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, విపక్షాల ఇండియా కూటమి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు  జరిగాయి. అంతలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఎందుకున్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.

More Telugu News