తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కి.మీ. నడుచుకుంటూ వెళ్తున్న అవ్వ.. వైరల్ వీడియో
- కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన
- కాలిబాటలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు
- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఓ వృద్ధురాలు పొరుగున ఉన్న కొండయ్యపల్లికి నడుచుకుంటూ వెళ్లింది. దారి మధ్యలో ఎదురైన యువకుడు అవ్వను పలకరించి ఎక్కడికి పోతున్నావని అడగగా.. కొండయ్యపల్లికి పోతున్నా అని బదులిచ్చింది. ఆ ఊరిలో తన తమ్ముడు ఉంటున్నాడని, రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టడానికి పోతున్నానని చెప్పింది. తమ్ముడిపై ప్రేమతో కష్టపడి నడుచుకుంటూ వెళుతున్న అవ్వను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. తమ్ముడిపై ఆ అవ్వకున్న ప్రేమను చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.