జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణంలోనైనా ఎన్నికలకు రెడీ.. సుప్రీంకోర్టుతో కేంద్రం
- ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే రాజ్యాంగ మార్పును తప్పుబట్టలేమన్న కేంద్రం తరపు న్యాయవాది తుషార్ మెహతా
- ఆగస్టు 31 నాటికి జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సానుకూల ప్రకటన వస్తుందని స్పష్టీకరణ
- జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాలపరిమితి చెప్పాలన్న సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గత విచారణలో మాట్లాడుతూ.. దేశంలో అందరినీ సమానంగా చూసేలా, వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చే రాజ్యాంగ మార్పును తప్పుబట్టలేమంటూ తన వాదనలు వినిపించారు. అత్యున్నతస్థాయి సమావేశం తర్వాత ఆగస్టు 31 నాటికి జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ‘సానుకూల’ ప్రకటన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఒక కాలపరిమితిని పేర్కొనాల్సిందిగా ధర్మాసనం మంగళవారం మొదటిసారి కేంద్రాన్ని కోరింది. స్పందించిన కేంద్రం జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణాన అయినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపింది.