Manasa Varanasi: తెలుగు తెరకి మరో కొత్త హీరోయిన్ .. మానస వారణాసి!

  • అశోక్ గల్లా హీరోగా రెండో సినిమా 
  • నాయిక ప్రధానంగా సాగే 'సత్యభామ'
  • సంగీతాన్ని సమకూర్చుతున్న భీమ్స్ 
  • దర్శకుడిగా అర్జున్ జంధ్యాల    

Sathyabhama Movie Update

అశోక్ గల్లా ఆ మధ్య తన సొంత బ్యానర్లో 'హీరో' అనే సినిమాను చేశాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడలేదు. అశోక్ ఫస్టు సినిమా అలా నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు అతను మరో కథను రెడీ చేసుకుని రంగంలోకి దిగాడు .. ఆ సినిమా పేరే 'సత్యభామ'.

ఈ సినిమాతో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయి పరిచయమవుతోంది. ఆ బ్యూటీ పేరే 'మానస వారణాసి'. ఈ సుందరి కోలీవుడ్ నుంచో .. మల్లూ ఉడ్ నుంచో దిగిపోయిందనుకుంటే పొరపాటే. తను అచ్చతెలుగు హైదరాబాద్ అమ్మాయి .. అందాల పోటీల్లో అనేక బహుమతులను సొంతం చేసుకుంది. 

'సత్యభామ'గా టైటిల్ రోల్ ను ఈ సినిమాలో పోషిస్తోంది. సోమినేని బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గతంలో కార్తికేయతో 'గుణ 369' సినిమా చేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాకి దర్శకుడు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. మరి రెండో సినిమాలో అశోక్ ఎలాంటి విన్యాసాలు చేస్తాడో చూడాలి.

More Telugu News