Shahrukh Khan: జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో సీక్రెట్ గా షారుక్ ఖాన్ ప్రత్యేక పూజలు

Shahrukh Khan offers prayers at Jammu Vaishnodevi temple
  • మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డ షారుక్
  • ముఖానికి మాస్క్ ధరించిన బాలీవుడ్ బాద్షా
  • సెప్టెంబర్ 7న విడుదల అవుతున్న షారుక్ తాజా చిత్రం 'జవాన్'
జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, ఆయన ఆలయ సందర్శన కార్యక్రమం సీక్రెట్ గా జరిగింది. మీడియా కంట పడకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. ముఖానికి మాస్క్ ధరించి ఆయన ఆలయానికి వెళ్లారు. అయితే, ఆలయ ప్రాంగణంలో షారుక్ నడుస్తూ వెళ్తున్న వీడియోలను కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు, షారుక్ తాజా చిత్రం 'జవాన్' సెప్టెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో నయనతార, ప్రియమణి, విజయ్ సేతుపతి, యోగిబాబు వంటి సౌత్ స్టార్లతో పాటు సంజయ్ దత్, రియాజ్ ఖాన్, గిరిజా ఓక్ తదితర బాలీవుడ్ నటులు నటించారు. ఈ సినిమా కోసమే వైష్ణోదేవి ఆలయంలో షారుక్ పూజలు నిర్వహించారని చెప్పుకుంటున్నారు. ఏడాది కాలంలో ఈ ఆలయాన్ని షారుక్ సందర్శించడం ఇది రెండో సారి. 
Shahrukh Khan
Bollywood
Vaishnodevi Temple

More Telugu News