Scorched-Earth Strike: దక్షిణ కొరియాను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా న్యూక్లియర్ డ్రిల్స్ చేపట్టిన ఉత్తర కొరియా

  • దక్షిణ కొరియాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఉత్తర కొరియా
  • అమెరికా బీ-1బీ బాంబర్లను మోహరించిన కొన్ని గంటల్లోనే అణుదాడి డ్రిల్స్
  • రెండు బాలిస్టిక్ క్లిపణులను ప్రయోగించినట్టు పేర్కొన్న నార్త్ కొరియా
North Korea stages scorched earth nuclear strike drills

క్షిపణి, అణ్వస్త్ర పరీక్షలతో నిత్యం బిజీగా గడిపే ఉత్తర కొరియా ఆగర్భ శత్రుదేశమైన దక్షిణ కొరియాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఆ దేశంలోని లక్ష్యాలను నామరూపాల్లేకుండా చేసేందుకు తాజాగా ‘స్కోర్చ్‌డ్-ఎర్త్’ అణుదాడి డ్రిల్స్ నిర్వహించింది. ఈ మేరకు దక్షిణ కొరియా అధికారిక మీడియా పేర్కొంది. అమెరికా ముందస్తు అణుదాడి ప్రణాళికలను తిప్పి కొట్టే వ్యూహంలో భాగంగానే ఈ దాడి నిర్వహించినట్టు తెలిపింది.  క్షిపణి యూనిట్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, ‘న్యూక్లియర్ స్ట్రైక్ మిషన్’ను సరిగ్గా నిర్వహించిందని నార్త్ కొరియా పీపుల్స్ ఆర్మీ (కేపీఏ)ను ఉటంకిస్తూ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ పేర్కొంది. 

సముద్రంలోకి ఉత్తర కొరియా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను బుధవారం ప్రయోగించినట్టు దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. మిత్ర రాజ్యాల కసరత్తుల కోసం అమెరికా బీ-1బీ బాంబర్లను మోహరించిన కొన్ని గంటల్లోనే ఇది జరిగినట్టు పేర్కొంది. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం డ్రిల్‌ను పరిశీలించారు.

More Telugu News