Revanth Reddy: కర్ణాటక హామీల గురించి మాట్లాడిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

  • ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో 100 రోజుల్లో హామీలు నెరవేర్చామన్న రేవంత్
  • తమకు కారుకూతలు రావని, జూటా మాటలు లేవన్న టీపీసీసీ చీఫ్
  • తెలంగాణలోను అధికారంలోకి వస్తామని రేవంత్ ధీమా
Revanth Reddy talks about Karnataka Congress poll promises

కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చామంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేస్తూ... చేతి గుర్తు మా చిహ్నం... చేసి చూపించడమే మా నైజమంటూ ట్వీట్‌ను ప్రారంభించారు.

ఇచ్చిన మాట ప్రకారమే.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. తమకు 'కారు'కూతలు రావని, జూటా మాటలు లేవన్నారు. మా మాట శిలాశాసనం.. మా బాట ప్రజా సంక్షేమం.. అంటూ తెలంగాణలోను అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక మేం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, మీ మోముపై చిరునవ్వులు మోసుకొస్తామన్నారు. జై కాంగ్రెస్... జై తెలంగాణ అంటూ ట్వీట్ ముగించారు.

మరో ట్వీట్‌లో రేవంత్ డీఎస్సీపై స్పందించారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కానీ సీఎం మాటల ప్రకారం ఖాళీలు 13వేలు మాత్రమేనని, అందులోను నోటిఫికేషన్లు 5వేల పోస్టులకు మాత్రమే ఇస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మెగా డీఎస్సీ కాదని, ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ అన్నారు.

More Telugu News