Vellampalli Srinivasa Rao: పురందేశ్వరితో కలిసి చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్

Chandrababu along with Purandeswari playing cheap politics says Vellampalli Srinivas
  • మోదీ, అమిత్ షాల ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న వెల్లంపల్లి
  • పురందేశ్వరిని అడ్డు పెట్టుకుని బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నారని ఎద్దేవా
  • చంద్రబాబును చూసి ఎవరూ ఓటు వేయరని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షాల ప్రాపకం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. పురందేశ్వరిని అడ్డు పెట్టుకుని మళ్లీ బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నారని... ఆమెతో కలసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నీచమైన రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. 

పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేసే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. బీజేపీ అండతోనే గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారని... ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఆయనకు లేదని చెప్పారు. చంద్రబాబును చూసి ఎవరూ ఓటు వేయరని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారని ప్రశ్నించారు. ప్రజలతోనే తమ పొత్తు అని జగన్ చెపుతుంటే... చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
Vellampalli Srinivasa Rao
Jagan
Chandrababu
Telugudesam
Daggubati Purandeswari
BJP
Narendra Modi
Amit Shah

More Telugu News