Leopard: అనారోగ్యంతో బాధపడుతున్న చిరుత.. సెల్ఫీలు తీసుకుని, దానితో ఆడుకుని, రైడ్ చేసే యత్నం!

  • మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఘటన
  • అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి దానితో ఆటలు
  • చంపాలని అనుకునేంతలోనే ఎంట్రీ ఇచ్చిన అటవీ అధికారులు
  • చిరుతను భోపాల్ వనవిహార్‌కు తరలించి చికిత్స
Sick Leopard Wanders Into Madhya Pradesh Village

చిరుత పులి కనిపిస్తే ఎంతటి ధీశాలి గుండెలైనా ఒక్కసారిగా కిందికి జారిపోతాయి. భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగు లంకించుకుంటారు.  కానీ, ఇక్కడ జరిగింది వేరు. దానితో ఆటలాడుకున్నారు, హింసించారు. దానిపైకెక్కి రైడ్ చేయాలని కూడా అనుకున్నారు. చంపేద్దామనుకునేలోపే అటవీ అధికారులు అక్కడికి చేరుకుని రక్షించారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా ఇక్లెరా గ్రామంలో జరిగిందీ ఘటన. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ చెట్టుకింద పడుకున్న చిరుతను చూసిన గ్రామస్థులు తొలుత భయంతో వణికిపోయారు. అయితే, అది దూకుడుగా లేకపోవడం, నీరసంగా కనిపించడంతో అనారోగ్యంతో బాధపడుతోందని తెలుసుకున్నారు. ఆ వెంటనే గ్రామస్థులందరూ కలిసి దానిని చుట్టుముట్టారు. దాంతో ఆడుకున్నారు. సెల్ఫీలు దిగారు. హింసించారు. ఓ వ్యక్తి అయితే దానిపైకి ఎక్కడి రైడ్ చేయాలని కూడా అనుకున్నాడు. మరికొందరైతే దానిని చంపేయాలని నిర్ణయించారు. 

ఇదంతా గమనించిన మరో వ్యక్తి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే అక్కడికి చేరుకుని వారి బారి నుంచి చిరుతను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఇప్పటికే మనం వాటి స్థానాల( అడవులు)ను ఆక్రమించుకున్నామని, ఇప్పుడు వాటి గోపత్యతకు కూడా భంగం కలిగిస్తున్నందుకు సిగ్గుపడాలని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. కాగా, స్వాధీనం చేసుకున్న రెండేళ్ల చిరుతను భోపాల్‌లోని వన విహార్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News