Chandrayaan 3: చంద్రయాన్​–3లో కీలక ఘట్టం.. చంద్రుడిపై ప్రాణవాయువు జాడ గుర్తింపు

  •  మనిషి నివాసానికి అవసరమైన కీలక
    మూలకాలను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్
  • సల్ఫర్‌తోపాటు ఆక్సిజన్‌ ఉనికి గుర్తింపు  
  • ఈ రోజు రాత్రి సూపర్ బ్లూ మూన్
Chandrayaan 3 Mission Pragyan Rover Detects Oxygen and Other Elements On Moon

చంద్రుడిపై మానవుడు జీవించే కాలంలో రాబోతోంది. ప్రాణికోటికి జీవనాధారమైన ఆక్సిజన్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై గుర్తించింది. చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా జాబిల్లి ఉపరితలంపైన అడుగు పెట్టిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనలు మొదలు పెట్టింది. చంద్రుడిపై సల్ఫర్‌తోపాటు ఆక్సిజన్‌ ఉనికిని గుర్తించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్‌ (ఎస్‌) ఉనికిని స్పష్టంగా గుర్తించినట్టు ఇస్రో వెల్లడించింది. అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్‌, క్రోమియం, టైటానియం, మాంగనీస్‌, సిలికాన్‌ ఉనికిని గుర్తించిందని, హైడ్రోజన్‌ (హెచ్‌)కోసం అన్వేషణ కొనసాగుతోందని ఇస్రో తెలిపింది. 

దాంతో, చంద్రుడిపై మనిషి నివసించటానికి అవసరమైన అన్ని మూలకాలు, పరిస్థితులను ఇస్రో గుర్తించినట్టయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అరుదైన సల్ఫర్‌ జాడ కనిపించడం చాలా కీలకం అవనుంది. సల్ఫర్‌ మంచు నీటి ఉనికికి సంకేతం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఈ రాత్రి చందమామ భూమికి మరింత దగ్గరగా రానుంది. సాధారణ పౌర్ణమి కంటే మరింత పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. దీన్ని సూపర్‌ బ్లూ మూన్‌ అంటారు.

More Telugu News