Jagan: ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మీకు మాట ఇస్తున్నా: జగన్

YS Jagan Rakhi wishes
  • అక్కచెల్లెమ్మలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • మీ ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడనని ట్వీట్
  • అన్నగా, తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని హామీ
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. తనపై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడనని అన్నారు. మీ సంక్షేమమే లక్ష్యంగా, మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని... మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నానని చెప్పారు. 

మరోవైపు, వైసీపీ కూడా పార్టీ తరపున రాఖీ శుభాకాంక్షలు తెలియజేసింది. 'ఒక సోదరుడిగా రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లెమ్మకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా సాధికారత కల్పిస్తూ… ఈ నాలుగేళ్ల పాలనలో దేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా అన్ని అంశాల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు సీఎం జగన్. అక్కచెల్లెమ్మలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటూ రాష్ట్రంలోని ప్రతి సోదరికి రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ట్వీట్ చేసింది.
Jagan
YSRCP
Rakhi

More Telugu News