Suhana Khan: నీ బోయ్ ఫ్రెండ్ మోసం చేస్తే ఏం చేస్తావనే ప్రశ్నకు షారుక్ కూతురు సుహానా సమాధానం ఇదే!

Suhana Khan anster to a question what you do if you boy friend dates with other girl
  • స్టార్ కిడ్ గా ఎంతో ఫాలోయింగ్ ఉన్న సుహానా
  • 'ది ఆర్చీస్'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ కూతురు
  • బోయ్ ఫ్రెండ్ మోసం చేస్తే వదిలేస్తానని వ్యాఖ్య
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ముద్దుల తనయ సుహానా ఖాన్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ కిడ్ గా ఆమె ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో సుహానా చాలా యాక్టివ్ గా ఉంటుంది. మరోవైపు ఆమె తెరంగేట్రం చేసిన 'ది ఆర్చీస్' డిసెంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సుహానా పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటోంది. 

తాజగా 'వోగ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. ఇతర అమ్మాయిలతో మీ బోయ్ ఫ్రెండ్ డేటింగ్ చేయడం, మిమ్మల్ని మోసం చేయడం వంటి వాటిని మీరు గుర్తిస్తే ఏం చేస్తారని ఆమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుహానా స్పందిస్తూ... అతన్ని వదిలేస్తానని చెప్పింది. కేవలం ఒక అమ్మాయిని మాత్రమే ప్రేమించే వ్యక్తిని మాత్రమే తాను ఇష్టపడతానని తెలిపింది. 

'ది ఆర్చీస్'లో సుహానాతో పాటు ఖుషి కపూర్, అగస్త్య నంద, మిహిర్ అహూజా, సింగర్ ఆదితి సైగల్, వేదాంగ్ రైనా తదితరులు నటించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Suhana Khan
Shahrukh Khan
Bollywood
Boy Friend

More Telugu News