Talasani: సెప్టెంబర్ 2న డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు: గుడ్‌న్యూస్ చెప్పిన తలసాని

  • జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీల వద్ద పంపిణీ
  • డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కోసం ఆన్ లైన్ డ్రా
  • పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్ధేశ్యంతో కేసీఆర్ పథకం తీసుకొచ్చారన్న తలసాని
Talasani Srinivas Yadav good news on double bedroom

డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న ఇళ్లను కేటాయించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కోసం ఆన్ లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మంత్రి వర్చువల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్ధేశ్యంతో కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకు వచ్చారన్నారు. పేదలు ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడాలేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించినట్లు చెప్పారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్టువేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు చెప్పారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున మొత్తం పన్నెండు వేల మందిని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీల వద్ద పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇళ్లు ఎవరికి వచ్చాయో అధికారులు చెబుతారన్నారు.

More Telugu News