మేం గేట్లు తెరిచామంటే వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుంది: చంద్రబాబు
- టీడీపీ జాతీయభావంతో ఉండే పార్టీ అని వెల్లడి
- కేంద్రంతో ప్రత్యేక హోదా అంశంపైనే విభేదించానని స్పష్టీకరణ
- ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని విమర్శలు
- విభజన గాయాల కంటే దారుణంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆవేదన
ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద సమస్య జగన్ అని అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. టీడీపీ గేట్లు తెరిస్తే చాలు... వైసీపీ విలీనం అయిపోతుంది.... మేం గేట్లు తెరిచామంటే వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుంది అని వ్యాఖ్యానించారు.