varalakshmi sarath kumar: నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌‌కు ఎన్‌ఐఏ నోటీసులు

  • ఇటీవల కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌
  • ఎన్ఐఏ అదుపులో కీలక నిందితుడు ఆదిలింగం
  • గతంలో వరలక్ష్మి వద్ద పీఏగా పని చేసిన ఆదిలింగం
  • అతడి వివరాల సేకరణ కోసం వరలక్ష్మికి ఎన్‌ఐఏ సమన్లు
nia issues summon to actress varalakshmi sarath kumar in drugs case

తమిళ సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్‌‌కు కేరళ ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఆమెకు సమన్లు ఇచ్చారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పీఏ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. 

కేరళలోని విళంజియం సమీపంలో ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఆదిలింగంను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ సరఫరాతో వచ్చిన డబ్బులను అతడు సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కేసులో వరలక్ష్మికి ఏమైనా సంబంధం ఉందా? గతంలో ఈమెకు ఆదిలింగం డ్రగ్స్ సరఫరా చేశాడా? అనే వివరాలను కూడా ఎన్‌ఐఏ రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News