స్పా ముసుగులో వ్యభిచారం.. బంజారాహిల్స్ లో స్పాలపై పోలీసుల దాడులు
- వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్ల సీజ్
- నిర్వాహకులు, విటులను అరెస్టు చేసిన పోలీసులు
- మొత్తం 17 మంది యువతులు రెస్క్యూ హోంకు తరలింపు
బంజారాహిల్స్ రోడ్ నెం.2 లో ఫ్యామిలీ సెలూన్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందని గుర్తించినట్లు బంజారాహిల్స్ ఎస్సై ఎస్.కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సెలూన్ కు ఎలాంటి అనుమతులు లేవని తేలిందన్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని, పదిమంది యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. దీంతో సెలూన్ నిర్వాహకుడిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.