R. K. Selvamani: ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్

  • పరువునష్టం కేసులో వారెంట్ జారీ చేసిన చెన్నై కోర్టు
  • పరువునష్టం దావా వేసిన ఫైనాన్షియర్ చనిపోయినా కొనసాగిస్తున్న ఆయన కుమారుడు
  • వచ్చే నెల 22కు విచారణ వాయిదా
Non bailable warrant  against Director RK Selvamani

ప్రముఖ దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ముకుల్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఓ చానల్‌ ఇంటర్వ్యూలో సెల్వమణి ఆరోపించారు.

ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ముకుంద్‌చంద్.. సెల్వమణిపై పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత ముకుంద్‌చంద్ చనిపోయినా ఆయన కుమారుడు గగన్‌బోత్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. సోమవారం ఈ కేసు విచారణ జరగ్గా సెల్వమణి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేసింది.

పలు తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించిన సెల్వమణి ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు.

More Telugu News