Undavalli Arun Kumar: ఆ కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదు: ఉండవల్లి

  • లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ వేదిక మీద అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారన్న ఉండవల్లి   
  • ఆమె వల్లే తాను బతికానని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారని వెల్లడి 
  • గతంలో కలిసిన టీడీపీ, బీజేపీ మళ్లీ కలుస్తాయేమోనన్న ఉండవల్లి
  • 1952 నుండి కమ్మ, రెడ్డి ఆధిపత్య పోరు ఉందన్న మాజీ ఎంపీ
  • చిరంజీవికి 16 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని వెల్లడి
Undavalli interesting comments on Laxmi Parvathi

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదలైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తాను ఎన్టీఆర్ భార్యనని, తనను ఆహ్వానించకపోవడం ఏమిటని లక్ష్మీపార్వతి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ఆమెను ఎన్టీఆర్ చాటుగా పెళ్లి చేసుకోలేదని, వేదిక మీద అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారన్నారు. ఆమె వల్లే తాను బతికానని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు.

బీజేపీ, తెలుగుదేశం పార్టీల పొత్తు గురించి ఉండవల్లి మాట్లాడుతూ... గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పని చేశాయన్నారు. ఇప్పుడు కూడా కలుస్తాయోమో చెప్పలేమన్నారు. ఏ కార్యక్రమం చేసినా ఏ పార్టీ అయినా అడ్వాంటేజ్ లేకుండా పని చేయవన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ... కమ్మవారు మంత్రిగా లేనిది ఈ విడత మాత్రమేనని చెప్పారు. 1952 నుండి రాష్ట్రంలో కమ్మ, రెడ్డి ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు. ఇటీవల కాపులు రాజకీయంగా కనిపిస్తున్నారని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 16 శాతానికి పైగా ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు ఓటును వెయ్యి, రెండువేలకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News