Vijayasai Reddy: ఓటర్ జాబితా విషయంలో చంద్రబాబు బాధ అదే: విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy on Chandrababu Naidu about voter list
  • ఆధార్ కార్డుకు ఓటర్ లింక్ చేస్తున్నారనేదే టీడీపీ అధినేత బాధ అని విమర్శ
  • ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ ఉంటే చంద్రబాబే విజయం సాధిస్తారని ఎద్దేవా
  • చంద్రబాబు హయాంలో మోసపూరిత ఓట్లను ఎలా ఎన్ రోల్ చేశారో ఈసీకి చెప్పామన్న ఎంపీ
ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్లకు సంబంధించి అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పరస్పరం ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రతినిధులు ఈసీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆధార్ కార్డుకు ఓటర్ కార్డు లింక్ చేస్తున్నారనేదే చంద్రబాబు బాధ అని ఆరోపించారు. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ పెడితే చంద్రబాబు కచ్చితంగా విజయం సాధిస్తారని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండాలి... పారదర్శకంగా ఉండాలనేదే వైసీపీ విధానమని స్పష్టం చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తమ ఓట్లను ఎలా తొలగించారో, అలాగే మోసపూరిత ఓట్లను ఎలా ఎన్‌రోల్ చేశారో కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పామన్నారు. 2015 నుండి చంద్రబాబు దొంగ ఓట్లను చేర్చారన్నారు. ఈసీ రూల్స్‌ను తుంగలో తొక్కారని నిప్పులు చెరిగారు. ఇంటి నెంబర్లు, పేర్లను టీడీపీ హయాంలో ఎలా మేనేజ్ చేశారో చెప్పామన్నారు. సేవా మిత్ర, మై టీడీపీ యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఈసీకి ఇచ్చామన్నారు. ఓటర్ ప్రొఫైలింగ్‌కు పాల్పడ్డారని, ఇది నేరపూరిత చర్య అన్నారు.

టీడీపీ అభ్యంతరకర సమాచారాన్ని సేకరిస్తోందన్నారు. ఓటరు నుండి పొలిటికల్ ప్రిఫరెన్స్, పార్టీ ఛాయిస్ అడుగుతున్నారని, ఇది ఎందుకో చెప్పాలన్నారు. ఎవరైనా ఓటర్ క్యాస్ట్ గురించి అడుగుతారా? అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటిని ఈసీ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఈ విషయాలను ఏబీఎన్, టీవీ5 కూడా వినాలను సూచించారు. 
Vijayasai Reddy
YSRCP
Andhra Pradesh
Telugudesam

More Telugu News