Sun: ఇప్పుడు సూర్యుడే మన టార్గెట్.. ఆదిత్య ఎల్ -1 ప్రయోగ తేదీని ప్రకటించిన ఇస్రో

  • సూర్యుడిపై ప్రయోగాలకు ఆదిత్య ఎల్ - 1ని ప్రయోగించనున్న ఇస్రో
  • సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగం
  • సూర్యుడిపై ప్రయోగాలకు ఇస్రో తొలి ప్రయత్నం
ISRO launching Aditya L 1 on Sep 2 for research on Sum

చంద్రుడిని ముద్దాలనుకున్న చిరకాల స్వప్నం తీరిపోయింది. చంద్రయాన్-3 ఆ కలను సాకారం చేసింది. చంద్రుడి రహస్యాలను శోధించే పనిలో ప్రజ్ఞాన్ రోవర్ బిజీగా ఉంది. ఈ విజయం ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో ఇప్పుడు ఇస్రో సూర్యుడిని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆదిత్య ఎల్-1ను ఇస్రో ప్రయోగించబోతోంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 11.50 గంటలకు దీన్ని ప్రయోగించనున్నారు. సూర్యుడిపై ప్రయోగాలకు ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం ఇదే. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో (ఎల్1 పాయింట్) శాటిలైట్ ను ఇస్రో ఉంచబోతోంది. దీనివల్ల గ్రహణాల ప్రభావం కూడా లేకుండా సూర్యుడిపై ఉపగ్రహం నిరంతరం పరిశోధన జరుపుతుంది. 

More Telugu News