Nara Lokesh: తెలుగువాడిగా, ఎన్టీఆర్ మనవడిగా గర్విస్తున్నాను: నారా లోకేశ్

Nara Lokesh on NTR currency release
  • ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ తెలుగు జాతికి దక్కిన వరమన్న లోకేశ్
  • కథానాయకుడు, ప్రజసేవకుడిగా ఒక్కతాటిపై నడిపించిన నాయకుడని ప్రశంస
  • చరిత్రలో నిలిచేలా నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్ 
స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ఆవిష్క‌రించ‌డం తెలుగుజాతికి ద‌క్కిన గొప్ప గౌర‌వమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. తెలుగువాడిగా, తెలుగుదేశం వాడిగా, నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా గ‌ర్విస్తున్నానని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ప్ర‌జాసేవ‌కుడు, తెలుగుజాతిని ఒక్క‌తాటిపై న‌డిపించిన మ‌హానాయ‌కుడని కొనియాడారు. కోట్లాది హృద‌యాల్లో దేవుడిగా కొలువైన ఎన్టీఆర్ తమకు స్ఫూర్తి అన్నారు. శ‌క‌పురుషుడు శ‌త‌జ‌యంతిని చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుద‌ల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Nara Lokesh
ntr
Telugudesam

More Telugu News