50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో వివో వీ29ఈ
- మొత్తం రెండు వేరియంట్లలో లభ్యం
- ధరలు రూ.26,999 నుంచి రూ.28,999 వరకు
- సెల్ఫీ ఫొటోలు మెరుగ్గా వచ్చేలా ఐ ఆటో ఫోకస్
ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ రంగుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ తో పాటు, వివో పోర్టల్, ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఇది స్లీక్ డిజైన్ తో వస్తుంది. కేవలం 7.57 శాతం ఎంఎం మందంతో ఉంటుంది. 6.73 అంగుళాల అమోలెడ్డిస్ ఫుల్ హెచ్ డీ ప్లే తో వస్తుంది. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఐ ఆటో ఫోకస్ ఫీచర్ తో ఉండడం వల్ల సెల్ఫీలు మరింత మెరుగ్గా వస్తాయని వివో ప్రకటించింది.
ఇక ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో డ్యుయల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంటుంది. రెండో కెమెరా 8 మెగాపిక్సల్ తో వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 44వాట్ అడాప్టర్ తో చార్జ్ చేసుకోవచ్చు. ఫోన్ బాక్స్ తోపాటు ఈ అడాప్టర్ కూడా వస్తుంది.