peanuts: రోజుకు గుప్పెడు పల్లీలు.. బోలెడన్ని లాభాలు

  • పీనట్స్ లో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్
  • చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెకు రక్షణ
  • పల్లీలతో పెరిగే ఆయుర్దాయం 
  • బరువు తగ్గేందుకు, మధుమేహం నియంత్రణకు మార్గం
Lesser known health benefits of eating peanuts daily

పల్లీలను ఇష్టంగా తినే వారు ఎంతో మంది ఉన్నట్టుగానే.. వాటిని దూరం పెట్టే వారు కూడా పెద్ద సంఖ్యలోనే కనిపిస్తారు. మరి ఈ పల్లీలను (పీనట్స్/వేరు శనగలు) రోజూ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..? రుచి కోసం తింటారు కానీ, చాలా మందికి వీటితో వచ్చే పోషకాల పట్ల అవగాహన ఉండదు. పీనట్స్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. రోజూ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. 

  • పల్లీల్లో ప్రొటీన్, ఆరోగ్యానికి మించి చేసే కొవ్వులు, పీచు, విటమిన్ బీ, విటమన్ ఈ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. 
  • పల్లీలలో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు మంచి చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తాయి. రెస్వెరట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉండడంతో గుండెకు ఎంతో రక్షణ లభిస్తుంది.
  • ఇక బరువు నియంత్రణకు సాయపడే గుణాలు కూడా పల్లీల్లో ఉన్నాయి. పీచుకు తోడు ప్రొటీన్ ఉన్నందున కడుపునిండిన తృప్తి లభించి, ఎక్కువ సమయం పాటు వేరే పదార్థాలు తినకుండా ఉంటారు. దీంతో బరువు తగ్గుతారు.
  • పల్లీ గింజల్లో ఫైబర్ వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గుతుంది. 
  • ఇక పల్లీ గింజల్లోని ప్రొటీన్, ఫైబర్, మంచి కొవ్వులు రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తాయి. ఒకేసారి గ్లూకోజ్ స్థాయులు పెరగకుండా చూస్తాయి. కనుక మధుమేహంతో బాధపడేవారు, మధుమేహం వచ్చే అవకాశం ఉన్న వారు రోజూ పల్లీలు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. 
  • రోజూ పల్లీలు తినే అలవాటు ఉన్న వారు ఎక్కువ కాలం పాటు జీవించి ఉంటారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పీనట్స్ తోపాటు ఇతర నట్స్ తినేవారికి, అసలు తినని వారితో పోలిస్తే మరణ ముప్పు తక్కువ. 

More Telugu News