Rahul Gandhi: ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీలో చిన్నారి ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi take autograph from a little girl in Ooty
  • ఊటీలో చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ
  • నోట్‌బుక్‌తో వచ్చి రాహుల్ ఆటోగ్రాఫ్ తీసుకున్న చిన్నారి
  • ఆ వెంటనే చిన్నారి ఆటోగ్రాఫ్ తీసుకుని జేబులో పెట్టుకున్న రాహుల్
తమిళనాడులోని ఊటీలో ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్‌గాంధీ అక్కడ ఓ చిన్నారి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మొత్తం మహిళలతో నడిచే ఈ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ చాక్లెట్ కూడా తయారుచేశారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారు తయారుచేసే ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. 

అదే సమయంలో రాహుల్ వద్దకు వచ్చిన ఓ చిన్నారి నోట్‌బుక్ ఇస్తూ ఆటోగ్రాఫ్ అడిగింది. వెంటనే దానిపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన కాంగ్రెస్ నేత.. ఆ తర్వాత అదే పుస్తకంపై బాలిక ఆటోగ్రాఫ్ తీసుకుని కాగితాన్ని చించి తన జేబులో పెట్టుకున్నారు.  అది చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. అలాగే, చాక్లెట్ ఫ్యాక్టరీలో రాహుల్ గడిపిన పూర్తి వీడియోను కూడా షేర్ చేసింది.
Rahul Gandhi
Ooty
Autograph

More Telugu News