Junior NTR: రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. జూనియర్ ఎన్టీఆర్ దూరం!

  • ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ. 100 నాణేన్ని ముద్రించిన కేంద్రం
  • నాణేన్ని విడుదల చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • షూటింగ్ బిజీ వల్ల వెళ్లలేకపోయిన జూనియర్ ఎన్టీఆర్
Chandrababu and NTR family members reached Rashtrapati Bhavan and Junior NTR skipped

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. ఈ నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. 

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే, 'దేవర' సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా తారక్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. మరోవైపు, ఎన్టీఆర్ భార్యనైన తనను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని కోరుతూ వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి రాష్ట్రపతికి లేఖ రాసినప్పటికీ... రాష్ట్రపతి భవన్ నుంచి ఆమెకు ప్రతిస్పందన రాలేదు. దీంతో, ఆమె ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఇంకోవైపు, ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ముద్రించారు.

More Telugu News