Uddhav Thackeray: మహారాష్ట్రలో పోటీ తర్వాత.. ముందు మీ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోండి: కేసీఆర్‌పై ఉద్ధవ్ థాకరే ఫైర్

  • దేశం బాగు కోరితే ఇండియా కూటమిలో చేరాలని కేసీఆర్‌కు ఉద్ధవ్ హితవు
  • ఎన్డీయేను అమీబాతో పోల్చిన మహారాష్ట్ర మాజీ సీఎం
  • ఎందులో చేరుతారో ఏదో ఒకటి బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్
  • ఓట్లు మాత్రం చీల్చే ప్రయత్నం చేయొద్దని సూచన 
Uddhav Thackeray Slams KCR Over His Stand

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం బాగు కోసం పోరాడతారా? లేదంటే, బీజేపీకి మద్దతిస్తారా? ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. మహారాష్ట్రలోని హింగోలీలో నిన్న నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. 

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునే జాతీయవాద పార్టీల కూటమి ‘ఇండియా’ అని పేర్కొన్న ఆయన.. ఎన్డీయే అనేది నిర్దిష్ట రూపంలేని అమీబా లాంటిదని, కాబట్టి కేసీఆర్ ఇండియా వైపు ఉంటారో, లేదంటే ఎన్డీయే వైపు ఉంటారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. 

దేశం వైపు ఉండాలనుకుంటే ‘ఇండియా’లో చేరాలని, బీజేపీతో ఉంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని కోరారు. అంతేకానీ, ఓట్లను మాత్రం చీల్చొద్దని హితవు పలికారు. మహారాష్ట్రలో పోటీ చేయడం సంగతి అటుంచి తొలుత తెలంగాణలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.

More Telugu News