Train Fire Accident: మధురైలో అగ్ని ప్రమాదం జరిగిన రైలు కోచ్ లో భారీగా నోట్ల కట్టలు

Half burnt currency notes found in Madurai fire accident train
  • శనివారం తెల్లవారుజామున మధురైలో రైల్లో అగ్నిప్రమాదం
  • ఫైర్ యాక్సిడెంట్ లో పెద్ద సంఖ్యలో మరణాలు
  • ఘటన జరిగిన వెంటనే మాయమైన ఇద్దరు వ్యక్తులు
గత శనివారం తెల్లవారుజామును తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్లో మంటలు ఎగసిపడిన సంగతి తెలిసింది. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక పెట్టెలో సగం కాలిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. రూ. 500, రూ. 200 నోట్లు ఈ కట్టల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ డబ్బు ఎవరిది? అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు.

మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయినట్టు పోలీసులు గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బలగాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి, వీరిద్దరికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఐఆర్టీసీ స్పెషల్ ట్రైన్ లో ఈ ప్రమాదం జరిగింది. 

Train Fire Accident
Madurai
Currency

More Telugu News