Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత

Another leopard caught in Tirumala
  • అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బోనులో ఆదివారం రాత్రి చిక్కిన చిరుత
  • కొన్ని రోజులుగా అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు ఫలితం
  • ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు
తిరుమలలో చిరుతలను పట్టుకునేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తాజాగా తెలిపారు. 

ఈ చిరుతను బంధించేందుకు అధికారులు కొన్ని రోజులుగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత పలుమార్లు బోను వరకూ వచ్చి వెళ్లినట్టు కూడా సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. ఆదివారం రాత్రి ఎట్టకేలకు ఈ చిరుత బోనులో చిక్కింది. ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిరుతలు పట్టుబడ్డాయని అధికారులు తెలిపారు.
Tirumala
Andhra Pradesh
Telangana

More Telugu News