Nara Lokesh: జగన్ దివాలాకోరు పాలనలో రైతులు సాగునీటిని కొనుక్కోవాల్సి రావడం దారుణం: లోకేశ్

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళానికి ఘనస్వాగతం
  • జలగ బాదుడు దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారన్న లోకేశ్
  • పెట్రోలు, డీజిల్ ధరల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేశాడంటూ వ్యంగ్యం
Lokesh Yuvagalam Padayatra enters into combined West Godavari district

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 8 రోజులపాటు 113 కి.మీ.లు సాగిన యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. 

చింతలపూడి నియోజకవర్గ శివార్లలో ఉమ్మడి కృష్ణాజిల్లా నాయకులు నెట్టెం రఘురామ్, కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్ర, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, దేవినేని ఉమ, బోడేప్రసాద్, కేశినేని శివనాథ్ (చిన్ని), పట్టాభి, గద్దే రామ్మోహన్, గద్దే అనూరాధ, కాగిత కృష్ణారావు, రావి వెంకటేశ్వరరావు, వైవిబి రాజేంద్రప్రసాద్, శ్యావల దేవదత్, తంగిరాల సౌమ్య తదితర సీనియర్ నాయకులు లోకేశ్ కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ఇదే స్పూర్తితో వచ్చే ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలని పిలుపునిచ్చారు. పార్టీ కేడర్ కు ఏ కష్టమొచ్చినా వెన్నంటే ఉంటానని భరోసా ఇచ్చారు. 

అనంతరం చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం శివార్లలో లోకేశ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టారు.  ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎంపీ మాగంటి బాబు, ఆరుమిల్లి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, ముళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి వాసు, మంతెన సత్యనారాయణరాజు తదితరులు లోకేశ్ కు స్వాగతం పలికారు.

లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్

కుడి చేత్తో 10 రూపాయల ఇచ్చి, ఎడమ చేత్తో వంద లాగేయడం గజదొంగ జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇది చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెంలో హెచ్ పీ పెట్రోలు బంకు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు పన్నులతో పెట్రోలు, డీజిల్ ధరల్లో మాత్రం ఏపీని దేశంలోనే నెం.1 స్థానంలో నిలిపాడు. జలగ బాదుడు దెబ్బకు జనం విలవిలలాడుతున్నారు. పన్ను మీద పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్న అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలంటే సైకో పోవాలి... సైకిల్ రావాలి!

నారా లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్... 

  • జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనలో సాగునీటిని రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రావడం దారుణం. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీటి కష్టాలు తొలగిస్తాం. తమ్మిలేరు సైడ్ వాల్స్ నిర్మించి ముంపు బెడద తప్పిస్తాం.
  • గతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు కట్టలేక మూలనబెట్టిన దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, వైసీపీ ప్రభుత్వం నాలుగో వంతు ఖర్చు చేయలేదు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ బోర్లకు నాణ్యమైన విద్యుత్ అందజేస్తాం.
  • జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ వెనుకా ఒక స్కామ్ దాగి ఉంటోంది. సెంటు పట్టాల పేరుతో రూ.7 వేల కోట్లు కొట్టేసిన జగన్ అండ్ కో తమ పార్టీ వారికి మాత్రమే ఇళ్లపట్టాలు ఇచ్చుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక, ఇల్లు లేని ప్రతి పేదవాడికి అధునాతన టెక్నాలజీతో ఇల్లు నిర్మించి ఇస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ 24/7 స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి గ్రామాలకు, పంచాయతీలకు గత వైభవం కల్పిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2624 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 11 కి.మీ.*

*197వరోజు (28-8-2023) యువగళం వివరాలు*

*చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*

ఉదయం

8.00 – సుందరరావుపేట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.45 – లింగపాలెంలో స్థానికులతో సమావేశం.

11.45 – వెలగపల్లిలో స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం 

12.15 – ఫాతిమాపురం జంక్షన్ లో రైతులతో సమావేశం.

1.00 – చింతలపూడి శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – చింతలపూడి శివారు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.30 – చింతలపూడి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.

6.00 – చింతలపూడి ఫైర్ ఆఫీస్ సెంటర్ లో రైతులతో సమావేశం.

రాత్రి

8.30 – తీగలవంచ శివారు విడిది కేంద్రంలో బస.


******

More Telugu News