Chandrababu: ఢిల్లీలో రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు

Chandrababu will meet Central Election Commission in Delhi tomorrow
  • ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు
  • రేపు రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ
  • హాజరుకానున్న చంద్రబాబు తదితరులు
  • దొంగ ఓట్లు, ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో రేపు (ఆగస్టు 28) ఎన్టీఆర్ చిత్రంతో ముద్రించిన రూ.100 నాణెం ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. 

ఇక, తన ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, పెద్ద సంఖ్యలో అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. 

ఇటీవల టీడీపీ నేతలు దొంగ ఓట్ల అంశంపై ఫిర్యాదులు చేయగా, స్పందించిన ఎన్నికల సంఘం ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి కీలక చర్యలు తీసుకుంది. రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది.
Chandrababu
Central Election Commission
New Delhi
TDP
Andhra Pradesh

More Telugu News