రేపు నగరిలో సీఎం జగన్ సభ... విద్యాదీవెన నిధుల విడుదల

CM Jagan will attend Nagari rally tomorrow
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ రేపు (ఆగస్టు 28) చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. నగరిలో భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేయనున్నారు. 

సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్నారు. నగరి మంత్రి రోజా సొంత నియోజకవర్గం కావడంతో సీఎం జగన్ కు అదిరిపోయే రీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో అందరి దృష్టి సీఎం జగన్ నగరి పర్యటనపై పడింది.
Go Back to Shorts
Jagan
Nagari
Vidya Deevena
Roja
YSRCP
Chittoor District

More Telugu News