Run Out: రనౌట్ అయిన కోపంలో బ్యాట్ విసిరేసిన బ్యాటర్.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి!

Frustrated Batter Hits Teammate With Bat After Getting Run Out
  • అమెచ్యూర్ క్రికెట్‌ పోటీలో ఘటన
  • అవుటైన కోపంతో బ్యాట్‌ను విసిరేసిన బ్యాటర్
  • క్రీజులో ఉన్న బ్యాటర్‌కు బలంగా తాకడంతో కుప్పకూలిన వైనం
రనౌట్ అయిన ఫ్రస్ట్రేషన్‌లో ఓ క్రికెటర్ కోపంగా బ్యాట్ విసిరేశాడు. అదికాస్తా క్రీజులో ఉన్న బ్యాటర్‌కు బలంగా తాకడంతో కుప్పకూలాడు. అమెచ్యూర్ క్రికెట్ మ్యాచ్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్నదాని ప్రకారం.. బౌలర్ సంధించిన బంతిని బ్యాటర్ బలంగా బాదాడు. దీంతో నాన్ స్ట్రైయికర్ బ్యాటర్ పరుగు కోసం ప్రయత్నించాడు. 

మరోవైపు, తొలుత పరుగుకు యత్నించిన బ్యాటర్ తర్వాత వెనక్కి తగ్గడంతో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ రనౌట్ అయ్యాడు. దీంతో కోపంతో మైదానం వీడుతూ బ్యాట్‌ను విసిరేశాడు. అది అమాంతం క్రీజులో ఉన్న బ్యాటర్ గుండెలపై బలంగా తాకింది. అంతే.. అతడు వెంటనే కిందపడి బాధతో విలవిల్లాడాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అయితే, దెబ్బ తగిలిన బ్యాటర్ పరిస్థితి ఏంటన్నది తెలియరాలేదు.
Run Out
Frustrated Batter
Viral Video

More Telugu News