Skanda: బాలయ్య ఒక వ్యక్తి కాదు శక్తి: 'స్కంద' ఈవెంటులో బోయపాటి

  • హైదరాబాదులో జరిగిన 'స్కంద' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య
  • ఆయనతో తన జర్నీని గురించి ప్రస్తావించిన బోయపాటి  
  • బాలయ్య ఆశీస్సులకి బలం ఎక్కువని వ్యాఖ్య 

Skanda movie pre release event

రామ్ హీరోగా బోయపాటి 'స్కంద' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో, శ్రీలీల కథానాయికగా అందాల సందడి చేయనుంది. రామ్ మాస్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా, సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బాలయ్య చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు హైదరాబాదులో జరిగింది.

ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ .. " బాలయ్యబాబుతో నేను 15 ఏళ్లుగా జర్నీ చేస్తున్నాను. ఆయన ఒక వ్యక్తి కాదు .. శక్తి. పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రను లొంగదీసుకునే నటుడు ఆయన. మా మధ్య గల సాన్నిహిత్యం కారణంగా ఆయన ఈ వేడుకకి వచ్చారు. ఆయన ఆశీర్వాదానికి ఎంత బలం ఉందనేది నాకు తెలుసు" అన్నారు. 

"రామ్ లో ఎనర్జీ ఎక్కువని అంతా అంటారు .. నేను మాత్రం ఆయనకి తపన ఎక్కువని చెబుతాను. ఆ తపన వల్లనే ఆయన ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక శ్రీలీల విషయానికి వస్తే, ఆమె మంచి డాన్సర్ మాత్రమే కాదు, అంతకు మించిన మంచి ఆర్టిస్టు. ఆమెను ఇప్పుడు ఏ హీరో పక్కన చేయడం లేదు అని అడగవలసి వస్తోంది" అంటూ నవ్వేశారు. 

More Telugu News