Amit Shah: ​తెలంగాణలో అమిత్ షా ఒక్కరోజు పర్యటన షెడ్యూల్ ఖరారు

  • రేపు తెలంగాణకు వస్తున్న కేంద్ర హోంమంత్రి
  • భద్రాచలం రాములవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
  • ఖమ్మం బహిరంగ సభకు హాజరు
  • బీజేపీ కోర్ కమిటీతో సమావేశం
Amit Shah tour schedule in Telangana announces

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు (ఆగస్టు 27) తెలంగాణలో అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో ఖమ్మం బహిరంగ సభ కూడా ఉంది. రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే ఈ సభలో పలువురు నేతలు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకుంటారని తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 2.25 గంటల నుంచి సాయంత్రం 6.25 గంటల వరకు అమిత్ షా తెలంగాణ గడ్డపై బిజీగా గడపనున్నారు. 


అమిత్ షా పర్యటన వివరాలు...

  • ఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరిక.
  • గన్నవరం నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెం రాక.
  • అక్కడ్నించి రోడ్డు మార్గంలో భద్రాచలం పయనం.
  • మధ్యాహ్నం 2.40 గంటల వరకు భద్రాచలం సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు
  • తిరిగి భద్రాచలం నుంచి రోడ్డు మార్గంలో కొత్తగూడెం చేరిక. అక్కడ్నించి మధ్యాహ్నం 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్ లో ఖమ్మం పయనం.
  • మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం చేరిక.
  • మధ్యాహ్నం 3.45 గంటల నుంచి 4.35 గంటల వరకు ఖమ్మంలో జరిగే రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభకు హాజరు.
  • అనంతరం బీజేపీ కోర్ కమిటీ సమావేశం.
  • సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్ లో గన్నవరం చేరిక.
  • గన్నవరం నుంచి సాయంత్రం 6.25 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణం.

More Telugu News