Daggubati Purandeswari: తిరుమల పవిత్రతపై జగన్ కు నమ్మకం లేదనే విషయం మరోసారి నిరూపితమయింది: పురందేశ్వరి

CM of AP Jagan does not have belief in the sanctity of Tirumala says Purandeswari
  • టీటీడీ నూతన సభ్యులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • జాబితాలో శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్
  • టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారంటూ పురందేశ్వరి మండిపాటు
వైసీపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. టీటీడీ బోర్డు అంటే రాజకీయ పునరావాస కేంద్రం అనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మరోసారి నిరూపించారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, అవినీతి ఆరోపణలతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో తొలగించబడ్డ కేతన్ దేశాయ్ తదితరులను టీటీడీ బోర్డులోకి తీసుకున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతపై జగన్ కు ఏమాత్రం నమ్మకం లేదనే విషయం ఈ నియామకాలతో మరోసారి నిరూపితమయిందని చెప్పారు. ఈ నియామకాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. టీటీడీ బోర్డు సభ్యుల జాబితాను షేర్ చేశారు. 

Daggubati Purandeswari
BJP
Jagan
YSRCP
TTD

More Telugu News