Stalin: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి జాతీయ అవార్డు ఇవ్వడంపై స్టాలిన్ మండిపాటు

  • 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి జాతీయ అవార్డు
  • మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న సినిమాకు అవార్డు ఇవ్వడం సరికాదన్న స్టాలిన్
  • ఇది జాతీయ సమగ్రతను దెబ్బతీయడమేనని వ్యాఖ్య
Stalin fires on announcing national award to The Kashmir Files movie

వివాదాస్పద చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా వివాదాలు, నిరసనల మధ్యే ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించి, భారీ కలెక్షన్లను రాబట్టింది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రం ముస్లిం వర్గాలు, సమైక్యవాదుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సినిమాను తెరకెక్కించారని పలువురు విమర్శించారు. 

మరోవైపు, ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటెగ్రిటీ విభాగంలో నర్గీస్ దత్ అవార్డును ఈ చిత్రానికి ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఈ సినిమాపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ఈ సినిమాకు జాతీయ సమైక్యత విభాగంలో అవార్డు ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. ఇలాంటి చిత్రానికి జాతీయ అవార్డును ఇవ్వడం ముమ్మాటికీ జాతీయ సమగ్రతను దెబ్బతీయడమే అవుతుందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.  

More Telugu News