Yevgeny Prigozhin: ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై ఎట్టకేలకు స్పందించిన రష్యా

  • ఈ నెల 23న జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ సహా 10 మంది మృతి
  • వాగ్నర్ మృతిని నిర్ధారించని రష్యా
  • ప్రమాదం విషయంలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టీకరణ
Kremlin denies it ordered the killing of Prigozhin

వాగ్నర్ కిరాయి సైన్యం నేత యెవెగ్నీ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలిన ఘటనపై రష్యా ఎట్టకేలకు స్పందించింది. ఈ ఘటనలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇదొక దురదృష్టకర ఘటన అని, ఈ మరణాలపై ప్రస్తుతం అనేక వదంతులు వ్యాప్తిలో ఉన్నాయని, ఈ ప్రమాదంలో తమ ప్రమేయం లేదని పేర్కొంది. ప్రిగోజిన్ మరణించారా? లేదా? అన్న విషయాన్ని ఫోరెన్సిక్ పరిశోధనలో తేలుతుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఫలితాలు రాగానే వెల్లడిస్తామని తెలిపారు. వాగ్నర్ సేనల భవిష్యత్తుపైనా తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు.

ఈ నెల 23న 10 మందితో వెళ్తున్న విమానం మాస్కో శివార్లలో కుప్పకూలింది. మృతుల్లో వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు.

More Telugu News